SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

ఈ రోజుల్లో డిగ్రీ పట్టా చేతికొచ్చిదంటే చాలూ.. పట్టణం వెళ్లాలి.. ఏదో కంపెనీలో 9-5 జాబ్‌లో జాయిన్ అవ్వాలి. చాలా మంది యూత్ ఈ రోజుల్లో ఎంచుకుంటున్నా మార్గం ఇదే. కానీ ఇక్కడో యువకుడు మాత్రం వీరందరికీ భిన్నంగా ఆలోచించాడు.. తన ఇంజనీరింగ్ పూర్తైన తర్వాత.. వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని ఇప్పుడు లక్షలు సంపాధిస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరూ.. వ్యవసాయంలో అన్ని డబ్బులు ఎలా సంపాధిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.

డిగ్రీ పూర్తికాగానే.. జాబ్‌ చేయాలి అనే మైండ్ సెట్‌తో చాలా మంది యువత నగరాలవైపు పరుగుతు తీస్తుంటే.. ఓ యువకుడు మాత్రం వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని సరికొత్త ఆదర్శంగా నిలిచాడు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ యువకుడు సాఫ్ట్‌వేర్, ఉద్యోగం, ఏసీ గదులు వద్దనుకొని ఆధునిక వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ లక్షలు సంపపాదిస్తున్నారు. అతనే మహారాష్ట్రలోని వాశింబే గ్రామానికి చెందిన అభిజిత్ పాటిల్.

2015లో పుణెలోని డి.వై. పాటిల్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పాటిల్.. తన ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్‌వేర్ జాబుల్లో కెరీర్‌ను వెతుక్కుంటే.. అతను మాత్రం వ్యవసాయాన్నే తన కెరీర్‌గా మల్చుకున్నాడు. 2020లో తనకున్న నాలుగు ఎకరాల భూమిలో ఎర్ర అరటి తోటను సాగు చేయడం స్టార్ట్ చేశాడు. రెండేళ్లలోనే పంట చేతికి రావడంతో.. తన పంటను అమ్మేందుకు సరైన మార్కెటింట్ స్టార్టజీని అమలు చేశాడు.

తన పంటను మార్కెట్‌లో అమ్మకుండా.. నేరుగా రిటైల్‌ ఔట్లెట్లకు సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇలా తన నాలుగు ఎరకాల పొలంలో పండిన మొత్తం 60 టన్నుల ఎర్ర అరటిని పుణె, ముంబై, ఢిల్లీలోని రిలయన్స్, టాటా రిటైల్ ఔట్‌లెట్లకు నేరుగా సప్ల చేసి.. ఏకంగా రూ. 35 లక్షలకు పైగా సంపాధించాడు.

ఎర్ర అరటి సాగుకు ఎలాంటి నేలలు అనుకూలం?: మీరు కూడా అభిజిత్‌లా అరటి సాగుతో డబ్బులు సంపాధించాలి అనుకుంటే.. మొదటి దానికి అనుమైన నేల ఏదో తెలుసుకోవాలి. అవును ఎర్ర అరటి సాగు బాగా రావాలి అంటే లోతైన, సారవంతమైన నేలలు చాలా కీలకం. ఆ నేలకు తేమను నిలుపుకునే సామర్థ్యం ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. నేల పీహెచ్ (pH) విలువ 6 నుండి 7.5 మధ్య ఉంటే బెటర్. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది.

ఎర్ర అరటి ప్రాముఖ్యత: నార్మల్‌గా మనం పసుపు రంగు అరటి పండ్లనే ఎక్కువగా చూసి ఉంటాం లేదా పచ్చ అరటి కాయలను చూసి ఉంటాము.దాదాపు ఇవి కూడా రుచికిగా వాటిలానే ఉంటాయి. కానీ పైన తొక్క మాత్రం ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉంటుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా మన సాదారణ అరటి పండ్లలాలనే అహారంలో చేర్చుకోవచ్చు.

  • Related Posts

    SRIRAM TV NEWS : 17 ఏళ్లకే AI స్టార్టప్ నిర్మించిన యువతి.. ChatGPTపై స్కూల్లో నిషేధం!

    స్కూల్లో ChatGPT, Claude వంటి AI టూల్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. 17 ఏళ్ల నవ్య తుతేజా దానిని అవకాశంగా మలుచుకుంది. న్యూరోడైవర్జెంట్ ఉద్యోగార్థులకు ఉద్యోగాలు తమకు సరిపోతాయో లేదో తెలుసుకునేందుకు ‘Raaha’ అనే ఉచిత AI ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. రెండు నెలల్లోనే…

    SRIRAM TV NEWS :హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్.. ఈ అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి!

    వర్షాకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. అనంతగిరి కొండలు, బోగతా జలపాతం, కుంతల ఫాల్స్, శ్రీశైలం, అరకు లోయ సహా వీకెండ్ ట్రిప్‌కు అనువైన 8 అద్భుతమైన ప్రదేశాలను తెలుసుకుని మీ 2026 ట్రావెల్ బకెట్ లిస్ట్‌ను సిద్ధం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    • By sriram
    • November 15, 2026
    • 12 views
    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    SRIRAM TV NEWS : చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!

    • By sriram
    • November 12, 2026
    • 10 views

    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    • By sriram
    • October 9, 2026
    • 24 views
    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    • By sriram
    • October 2, 2026
    • 26 views
    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    • By sriram
    • October 2, 2026
    • 24 views
    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!

    • By sriram
    • October 2, 2026
    • 25 views
    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!