SRIRAM TV NEWS : ఆరోగ్యానికి అమృతం లాంటిది ఈ కారం పొడి.. 6 నెలలు నిల్వ ఉండే పక్కా కొలతలు!

మన పూర్వీకులు తిన్న ఆహారాల్లో మునగాకుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వందల రోగాలను నయం చేసే శక్తి ఈ ఆకుకు ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే నేటి బిజీ లైఫ్‌లో ప్రతిరోజూ మునగాకు కూరలు చేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ స్పెషల్ మునగాకు కారం పొడిని ఒకసారి చేసి పెట్టుకుంటే, ఏకంగా 6 నెలల పాటు వాడుకోవచ్చు. హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు లేదా ఆఫీసులకు వెళ్లేవారికి ప్రతిరోజూ మంచి పోషకాలు అందడానికి ఈ కారం పొడి ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.

ఈ కారం పొడి తయారీకి మునగాకును ఎంచుకునేటప్పుడు మరీ లేతగా ఉన్నది కాకుండా, మరీ ముదిరిపోయినది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకులను సేకరించాలి. ఆకులను కాడల నుండి వేరు చేసి, నీటిలో మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఆకుల్లో ఇసుక లేదా దుమ్ము ఏమీ లేకుండా చూసుకోవాలి. కడిగిన మునగాకును ఒక కాటన్ గుడ్డపై పరుచుకుని, తడి అంతా పూర్తిగా ఆరిపోయే వరకు నీడలోనే ఆరబెట్టుకోవాలి.

ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి, ఆకులు పూర్తిగా పొడిగా మారేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇందులో ఒక కప్పు వేరుశనగ పప్పు (పల్లీలు), ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు, ఒక జానెడు పరిమాణంలో అల్లం ముక్కలను వేసి లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

అదే బాండీలో నిమ్మకాయ సైజు అంత చింతపండును చిన్న ముక్కలుగా చేసి తడి లేకుండా వేయించాలి. ఆ తర్వాత పావు కప్పు ధనియాలు, తగినన్ని ఎండుమిర్చి, ఒక టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. చివరగా అర టీస్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

కారం పొడి తయారీ విధానం ఇప్పుడు అదే బాండీలో పూర్తిగా ఆరిపోయిన మునగాకును వేసి మీడియం ఫ్లేమ్ లో నిదానంగా వేయించాలి. ఆకు అంతా డ్రైగా మారి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, మొదట వేయించిన పప్పులు, మసాలాలు, చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి మిక్సీ జార్ లో కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన మునగాకును, కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.

చివరగా ఈ పొడిని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి బాగా కలుపుకుని, పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఆరు నెలల పాటు అస్సలు పాడవదు. వేడివేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు లేదా వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ మునగాకు కారం పొడితో తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతాయి.

  • Related Posts

    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. అందుకే ఇటుకలు, సిమెంట్, ఇసుక, ప్రధాన పిల్లర్లకు వాడే ఇనుప కడ్డీల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ఇంట్లో నిత్యం ఉపయోగించే మెట్ల నిర్మాణం విషయంలో మాత్రం చాలామంది అంతగా…

    SRIRAM TV NEWS : చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    • By sriram
    • November 15, 2026
    • 12 views
    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    SRIRAM TV NEWS : చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!

    • By sriram
    • November 12, 2026
    • 10 views

    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    • By sriram
    • October 9, 2026
    • 24 views
    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    • By sriram
    • October 2, 2026
    • 26 views
    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    • By sriram
    • October 2, 2026
    • 24 views
    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!

    • By sriram
    • October 2, 2026
    • 25 views
    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!