SRIRAM TV NEWS : తిరుమల వెళ్లేవారికి బిగ్‌ అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల.. ఈ డేట్స్ మర్చిపోకండి!

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి వుండే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే తిరుమల శ్రీవారి దర్శనాలు, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలను తాజాగా టీటీడీ ప్రకటించింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.ఆర్జిత సేవా టికెట్ల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఇక అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుండగా, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది టీటీడీ.అలాగే ఆగస్ట్‌ 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ పేర్కొంది.

  • Related Posts

    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌ విధానంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మి భక్తులు కంగారు పడొద్దని కోరింది. టికెట్లకు ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న కోటాకు మధ్య…

    SRIRAM TV NEWS : ఇంట్లో ఎక్కడ దీపం వెలిగించకూడదు? ఈ తప్పులు చేయకండి.. వాస్తు నియమాలివే!

    వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపం వెలిగించే ప్రదేశం, జ్వాల దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని ప్రదేశాల్లో దీపం వెలిగించకూడదని చెబుతారు. ఇంట్లో ఎక్కడ దీపం పెట్టకూడదో, ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం. దీపం కేవలం వెలుగును అందించడమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    • By sriram
    • November 15, 2026
    • 12 views
    SRIRAM TV NEWS : ఇంటి నిర్మాణానికి ఏ స్టీల్ వాడితే మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..

    SRIRAM TV NEWS : చికెన్, మటన్ తినిపిస్తే వేస్ట్.. మీ పిల్లలు క్లాస్ టాపర్ అవ్వాలంటే వారానికి రెండుసార్లు ఈ చేపలు పెట్టాల్సిందే!

    • By sriram
    • November 12, 2026
    • 10 views

    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    • By sriram
    • October 9, 2026
    • 24 views
    SRIRAM TV NEWS : 4 రోజులు.. 9 రాష్ట్రాలు.. 4,000 కి.మీ. ప్రయాణం! ఈ ట్రైన్ ప్రత్యేకత తెలిస్తే షాకవ్వాల్సిందే..!

    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    • By sriram
    • October 2, 2026
    • 26 views
    SRIRAM TV NEWS :  శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    • By sriram
    • October 2, 2026
    • 24 views
    SRIRAM TV NEWWS : 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..

    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!

    • By sriram
    • October 2, 2026
    • 25 views
    SRIRAM TV NEWS : రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..!